Listen to this article

జనం న్యూస్‌ 04 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

తేదీ 03.02.2026 నాడు గురజాడ పాఠశాలలో “మాక్ పార్లమెంటు” మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకూ చాలా ఆసక్తికరంగా, ఉత్తేజపూరిత వాతావరణంలో జరిగింది. పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష లోక్ సభ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు చాలా వివరంగా విద్యార్థులు తమ ప్రదర్శనలో కనబరిచారు.
చర్చాంశాలు – ముఖ్యాంశాలు:మొత్తం కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సమన్వయం, ప్రధాన మంత్రి వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టడం, దానికి అధికార పార్టీకి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి వివరణ ఇవ్వడం వంటివి ఆకట్టుకున్నాయి.ప్రతిపక్ష పార్టీ వారు రైతులకు ఉపయోగపడని బిల్లులు ప్రవేశపెట్టడం కంటితుడుపు చర్యగా అభివర్ణించారు.వ్యవసాయ బిల్లులతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పి.యం. జన్ మన్ బిల్లు, మరియు పరిశ్రమలను ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసే బిల్లులను ప్రవేశపెట్టి లోతైన చర్చ జరిపారు.ప్రైవేటీకరణపై వాడీవేడీ వాదనలు:లాభాల్లో నడుస్తున్న పరిశ్రమలను అదానీ వంటి పెట్టుబడిదారులకు ఇవ్వడాన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా దుయ్యబట్టారు.ప్రభుత్వ రంగాన్ని వదిలి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం అంటే ప్రజల ఆస్తులను పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెట్టడమేనని వాదించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా వాదనలు వినిపించారు.దీనికి సమాధానంగా, ప్రభుత్వం వ్యాపారం చేయడానికి లేదని, పారిశ్రామిక వేత్తల ద్వారా దేశాభివృద్ధి సాధ్యమని అధికార పక్ష సభ్యులు తమ మెజారిటీతో బిల్లులను ఆమోదించారు.రెండు గంటల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ సభలో పాఠశాల డైరెక్టర్ ఎం.వి.ఆర్. కృష్ణజీ, కరస్పాండెంట్ ఎం. స్వరూప, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫణి శేఖర్, పద్మజ, శిరీష, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.