సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 04 02 2026
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ పరిష్కారాలపై భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రజలతో విస్తృతంగా చర్చిస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. యువత, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో మైపాల్‌కు మద్దతు తెలుపుతూ ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వార్డు అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తున్న పెద్దబాయి మైపాల్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, గెలుపు ఖాయమనే నమ్మకం కార్యకర్తల్లో కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


