జనం న్యూస్ 04 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా
పరిగి మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుడుముల రజిత వెంకటేష్ గారికి CPM నుంచి పోటీ చేసిన షబ్బేనూర్ రియాజ్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.టి.రామ్మోహన్ రెడ్డి సమక్షంలో రియాజ్ మాట్లాడుతూ.. తాను పోటీలో లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పూర్తిస్థాయిలో పనిచేస్తానని తెలిపారు. డా.టి.రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిగి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రియాజ్ తెలిపారు.


