Listen to this article

జిల్లా వ్యాప్తంగా అభిమానుల సమక్షంలో పలు సేవా కార్యక్రమాలు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి : ముత్యాల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు నరసింగరావుపేటలో వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులు అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి ఎం వి ఆర్ కు నోటి తీపి చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానులకు స్వీట్స్ పంచారు. ప్రజా సేవ కోసం, ప్రజల బాగోగుల కోసం నిత్యం పరితపిస్తున్న వ్యక్తి.తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన అభిమానులు వేయికళ్ల తో ఎదురు. చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుకలు సందర్బంగా బుధవారం ఎం వి ఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు,యువసేన సభ్యులు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం నుంచే అన్ని ప్రాంతాల్లోని కుల పెద్దలు, అభిమానులు నరసింగరావు పేటలోని ఎం వి ఆర్ ప్రధాన కార్యాలయానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసారు.అనకాపల్లి.. లో.స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ సమీపాన ఎం.వి.ఆర్ యువసేన సభ్యుడు గైపూరి రాజు పర్యవేక్షణలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు.చోడవరం. లోఎం.వి.ఆర్ యువసేన సభ్యుడు వెంకట శ్రీను ఆధ్వర్యంలో చోడవరంలో ఎం వి ఆర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు హాస్టల్ పిల్లలకు అన్న సమారాదన ఏర్పాటు చేశారు. అదే విధంగా, గతంలో ఉచిత బస్సు యాత్రలకు, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లి వచ్చిన వారిలో చాలా మంది ఎం వి ఆర్ కు శుభాకాంక్షలు తెలిపి వారి యొక్క దీవెనలు అందజేశారు./