జనం న్యూస్ ఫిబ్రవరి 4 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మునిసిపల్ ఎలక్షన్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు నర్సాపూర్ నియోజకవర్గంలోమున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు మంత్రి వెంట కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మరియు ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఉపాధ్యక్షుడు పండరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు గ్యాల బోయిన నర్సింలు మరియు బాగయ్య ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తదనంతరం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సూచించారు ప్రతి ఒక్కరూ కార్యకర్త తన భుజాలపై కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపి మున్సిపల్ ఎన్నికల్లో విజయ సంకేతం ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు


