జనం న్యూస్ ఫిబ్రవరి 4 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు పటేల్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనైనది ఈ సమావేశంలో అందరి అభిప్రాయం మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి గోపు సునంద సంతోష్,ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెట్టి గాడి అంజయ్య, మాట్లాడుతూ మహిళా అధ్యక్షురాల పదవి చాలా కీలకమైందని నూతన అధ్యక్షులు అన్ని మండలంలో కమిటీలు ఏర్పాటు చేసి మండల మహిళ అధ్యక్షులను ఎన్నిక చేయవలెనని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు కుంటి ఆంజనేయులు, సంకరి రాజలింగం, తోట భూమన్న, పాల్వంచ మండల అధ్యక్షులు నల్లల అంజయ్య, ప్రధాన కార్యదర్శి జగడం నర్సింలు, బి ఆర్ పల్లి సర్పంచ్ నాగరాజు, మండల కోఆర్డినేటర్ సుర రవికుమార్, ఇస్సాయిపేట సర్పంచ్ జగడం లలితా నరసింహులు, నగర్ మండల్ బాధ్యులు కాశీనాథ్, భవానిపేట్ బాధ్యులు గోపు శ్రీనివాసు, కామారెడ్డి బాధ్యులు దర్శనం రాజు, పాల్గొన్నారు.


