జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్, తాడికొండ మాజీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి జన్మదిన సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని VL ఫంక్షన్ హాల్‌లో ఆమె అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ శ్రీదేవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


