Listen to this article

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

బొబ్బిలి మండలం దిబ్బగుడివలసలో రేబీస్ లక్షణాలతో తొమ్మిదేళ్ల రామవరపు రమణ మృతి చెందాడు. జనవరి 8న పిచ్చికుక్క ఇద్దరిని కరవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. రమణను తీవ్రంగా గాయపరచడంతో రేబీస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కె జి హెచ్ తో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.