చర్యలు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి
జనం న్యూస్ | ఫిబ్రవరి 5 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి
బాలానగర్ డివిజన్ పరిధిలో ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులు ముందడుగు వేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న దాసరి బస్తి కమిటీ హాల్ నిర్మాణ పనులను స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించి, సుమారు రూ.20 లక్షల వ్యయంతో పనులను ప్రారంభించారు.ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కమిటీ హాల్ నిర్మాణం పూర్తయితే, దాసరి బస్తి ప్రాంత ప్రజలకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునే స్థిరమైన వేదిక లభించనుందని కార్పొరేటర్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆవుల రవీందర్ రెడ్డి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ గాజుల రాములు, దాసరి బస్తి అధ్యక్షులు ఆదిమూల నాగేష్, సభ్యులు ఆదిమూల వెంకటేష్, ఎండపల్లి నరసింహ, ఘనసాల కృష్ణ, ఆకుల శ్రీనివాస్, అదెల్లా జగదీష్, ఘనసాల మహేష్, ఘనసాల సత్యనారాయణ, టి. బాబర్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండే కార్పొరేటర్ చొరవను స్థానికులు అభినందించారు.



