Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 5 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చిట్కుల్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సంత ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది
ఈ సంత ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీవో తిరుపతి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు విష్ణు వర్ధన్ రెడ్డి, విట్టల్ రెడ్డి, కిష్టారెడ్డి,మాజీ సర్పంచ్, ఎంపిటిసి, రైతులు, గ్రామస్తులు అలాగే సమీప గ్రామపంచాయతీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సంత ప్రారంభం వల్ల రైతులకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం లభించడంతో పాటు, గ్రామ ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు ఒకేచోట అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా మరో ముందడుగుగా నిలిచే ఈ సంతను విజయవంతంగా నిర్వహించినందుకు గ్రామపంచాయతీ ప్రతినిధులు, అధికారులు మరియు సహకరించిన గ్రామస్తులందరికీ అభినందనలు తెలిపారు.