Listen to this article

జనం న్యూస్ | ఫిబ్రవరి 5తెలంగాణ స్టేట్ ఇంచార్జి : శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ అధికారులు పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశాన్ని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వర రావు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ టి. కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 14వ స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్న బంగారు పతకాల సంఖ్య, డిగ్రీలు పొందనున్న విద్యార్థుల మొత్తం సంఖ్యతో పాటు, విశ్వవిద్యాలయం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచే దిశగా జేఎన్‌టీయూహెచ్ చేపడుతున్న చర్యలను కూడా ఆయన వివరించారు.విశ్వవిద్యాలయ అకడమిక్‌, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశోధన రంగంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా మారనున్నాయని ఉపకులపతి పేర్కొన్నారు.
ఈ పత్రికా సమావేశంలో జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ డాక్టర్ కె. విజయ కుమార్ రెడ్డి, విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొని స్నాతకోత్సవ ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు