Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

పవిత్రమైన తిరుమల దేవస్థానం లో గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన లడ్డు మహా ప్రసాదం కల్తీ వ్యవ హారంపై రాయలసీమ కే ప్రసిద్ది కంచిన మన నందలూరు లో వెలసిన శ్రీ సౌమ్యనాథ స్వామి గుడి వద్ద ప్రెస్ మీట్ నిర్వహించిన కడప జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి గురివిగారి వాసు.ఈ సందర్బంగా కార్యక్రమాల విభాగం కడప జిల్లా కార్యదర్శి గురివి గారి_వాసు మాట్లాడుతూ పవిత్ర మైన తిరుమల దేవస్థానంలో గత YSRCP హయంలో శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యి కి బదులు రసాయనాలతో కూడిన సింథటిక్ పదార్దాలు కలిగిన నెయ్యి తో కల్తీ లడ్డూలను తయారు చేసి కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా YSRCP నాయకులు వ్యవహరించారని పవిత్రమైన తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసే విధంగా రసాయనంతో కూడిన నెయ్యి సరఫరా చేయడం జరిగిందని తెలిపారు.ఇటీవల ఇచ్చిన సిట్ దర్యాప్తులో పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో ఒక్క చుక్క ఆవు పాలు లేకుండా, కృత్రిమ నెయ్యిని వినియోగించారని కుండబద్దలు కొట్టినట్టు చెబు తున్నప్పటికీ, YSRCP శ్రేణులు దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.ఇలాంటి వైసీపీ చేస్తున్నా అబద్దాలను ప్రజల్లోకి బలంగా వార్డ్,గ్రామ, మండల,నియోజకవర్గ స్థాయిలో ప్రతీ గడప గడపకి వివరిస్తామని మరియు ఈ కృత్రిమ నెయ్యి 2019 నుండి 2024 మధ్య వరకు సుమారు ఒక లక్షా 80వేల కేజీల కల్తీ నెయ్యి లడ్డు ప్రసాదం లో వాడారని తద్వారా YSRCP పెద్దలకు సుమారు 235కోట్లు లభించినది తెలిపారు..ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నందలూరు మండల నాయకులు బన్నీ,హర్ష వర్ధన్,అరుణ్ పాండే, శివ, మని, ప్రతాప్ ,శివ ప్రసాద్ (గాంధీ),వంశీ మండేమ్, సురేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు..