జనం న్యూస్ నందలూరుకడప జిల్లా
నందలూరు: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లలో రాయితీ కోసం దివ్యాంగులకు అందించే ‘రైల్వే దివ్యాంజన్ కార్డ్’ ఆన్లైన్ నమోదు ప్రక్రియ నందలూరులో ప్రారంభ మైంది. రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణ్ రాజ్ సమక్షంలో రైల్వే అధికారుల సమన్వయంతో ఈ ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందలూరు మండల వైద్యాధికారి శరత్ కమల్ విచ్చేశారు. వైద్య సహాయ సిబ్బంది మధు సూదన్ పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ క్రైమ్ రీజినల్ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి, సమాజ సేవ సమితి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు పఠాన్ మెహర్ ఖాన్,మాడపూరి శ్రీరాములు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.ఉచిత సేవలు: దివ్యాంగులకు ఉచితంగా ఆన్లైన్ అప్లై చేసే సదుపాయం కల్పించారు.మరో మూడు రోజులు: ఈ సేవలు మరో మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.
దివ్యాంగుల సంతోషం: ఈ ఆన్లైన్ సేవల పట్ల మండల విభిన్న ప్రతిభావంతులు సంతోషం వ్యక్తం చేశారు.
వివరాలకు సంప్రదించండి:రైల్వే దివ్యాంజన్ కార్డ్ కావాల్సిన వారు నందలూరు నాగిరెడ్డిపల్లి గ్రామంలోని హ్యూమన్ రైట్స్ ఆఫీసు నందు సంప్రదించగలరు.ఫోన్ నంబర్లు:డేవిడ్ కళ్యాణ్ రాజ: 9652652402
మెహర్ ఖాన్: 7396500319


