Listen to this article

జనం న్యూస్‌ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీలో ఉన్న లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సంధ్యారాణి అన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సంధ్యారాణి లొద్ద జలపాతాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనులకు డోలీల కష్టాలు తీర్చేందుకు ఆరు కోట్ల రూపాయలతో రహదారులు నిర్మిస్తున్నామని అన్నారు. ఇకపై గిరిజనులకు డోలిమోతల కష్టాలు ఉండవన్నారు. లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.పార్వతీపురం మన్యం జిల్లాలో వున్న జలపాతాలన్నింటిలో లోద్ద జలపాతం ఊటీ, అరుకును తలపించేలా ఇక్కడ వాతావరణం చుట్టూ ఎత్తైన కొండలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ జలపాతానికి వచ్చే సందర్శకుల నిమిత్తం ట్రక్కింగ్ చేయుటకు తర్ఫీదు పొందిన గైడ్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇక్కడ రాత్రివేళ బస చేయడానికి గెస్ట్ హౌస్ లను ఏర్పాటు చేస్తామన్నారు. లొద్ద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే గిరిజనులకు మరికొంత ఉపాధి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.