Listen to this article

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

బిచ్కుంద ఫిబ్రవరి 6 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు 6 వ అభ్యర్థి నౌష నాయక్ తో కలిసి శుక్రవారం రోజు 6వ వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రజలను కలుసుకొని ఓటును అభ్యర్థించారు..ప్రచారంలో భాగంగా వార్డులలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కి ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం, మద్దతు లభిస్తుంది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బిచ్కుంద అభివృద్ధికై అందరూ కలిసి రావాలని, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు..మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో సమస్యలు అన్ని పరిష్కరిస్తామని,బిచ్కుంద పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని తెలిపారు..బిచ్కుంద మున్సిపాలిటీలో మొత్తం 12 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు..అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తోందని. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు..ప్రధానంగా రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ సాగుకు అవసరమైన ఆర్థిక భద్రతను కల్పిస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టి వారి దైనందిన ఖర్చులను తగ్గించింది. పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ గృహ వ్యయాన్ని తగ్గిస్తోంది..అదేవిధంగా రేషన్ కార్డులు జారీ చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తూ ప్రతీ పేదవాడికి కడుపు నిండా భోజనం పెడుతుందని అన్నారు..యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. విద్య, వైద్యం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం చేస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు..అలాగే దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు..ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు