జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2026
బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీ ఓంకార సిద్దేశ్వర పుణ్యక్షేత్రం మరియు శ్రీ శివనందేశ్వర స్వామి దేవస్థానముల ఆహ్వాన పత్రికను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తమ స్వగ్రామమైన వేల్పనూరు గ్రామంలో గురువారంనాడు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి ఏ నాగ ప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని శ్రీ ఓంకారం పుణ్యక్షేత్రానికి మరియు శ్రీ శివ నందీశ్వర స్వామి పుణ్యక్షేత్రాలకు ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంకారం, శివ నంది పుణ్యక్షేత్రాల కార్యనిర్వాహణ అధికారి ఏ.నాగ ప్రసాద్, ఓంకారం చైర్మన్ చెన్నారెడ్డి, శ్రీ శివ నందీశ్వర దేవస్థానం చైర్మన్ మద్దిగారి పుష్పరాజు,మురళి రెడ్డి, మద్దిగారి భూపాలు,మద్దిగారి పాపయ్య, ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు చక్రపాణి శర్మ, మృగపానిశర్మ, భవాని శివశంకర శర్మ, ఆలయ కమిటీ, తదితరులు పాల్గొన్నారు.


