సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జ్వరం న్యూస్ ఫిబ్రవరి 6. 2. 2026
డోర్ టు డోర్ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. జహీరాబాద్ పట్టణ అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ చేసిన సేవలు మరువలేనివని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల్లో గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన ప్రజలకు గుర్తు చేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే టిఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే, వార్డు అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తానని పెద్దబ్బాయి మైపాల్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా పేదలు, దళితులు, బీసీలు, మైనార్టీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రత, వృద్ధులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తానన్నారు.డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని, ప్రజలతో ఎప్పుడూ నేరుగా సంబంధం ఉంచే కౌన్సిలర్‌గా ఉండటమే తన లక్ష్యమని పెద్దబ్బాయి మైపాల్ స్పష్టం చేశారు. ఆయన ప్రచారానికి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో పెద్దబ్బాయి మైపాల్ డోర్ టు డోర్ ప్రచారం ప్రజలలో మంచి స్పందనను రాబడుతూ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తోంది.



