Listen to this article

జనంన్యూస్. 06.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి మమత రత్నాకర్ గౌడ్. ప్రతి ఇంటి గడపగడపకు తిరిగి తమదైన పద్ధతిలో ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ప్రతి ఇంటికి ఏదో రకంగా కాంగ్రెస్ పథకాలు చేరాయని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని స్థానిక ఓటర్ల మీద తమకు నమ్మకం ఉన్నదని గత పది సంవత్సరాలలో మహిళలకు విజయం అందించిన ఘనత ఈ వినాయక నగర్ మహిళలేనాని తెలిపారు. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులు తమకు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలతో తమకు ఉన్న పరిచయాలతో డివిజన్ ను నిజామాబాదు కార్పొరేషన్ లో మొదటి స్థానం లో ఉంచడానికి అన్ని విధాల అభివృద్ధి కి ప్రయత్నం చేస్తామని తాము స్థానికంగానే నివసించే వారామని కష్టసుఖాల్లో 24 గంటలు తోడుండే వారమని ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వమని కోరారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని అన్ని విధాల ప్రయత్నం చేసి నిధులు తీసుకువచ్చి వినాయక నగర్ ఆరవ డివిజన్ ను రోడ్లు డ్రైనేజ్ త్రాగునీరు దేనికి లోటు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు దయచేసి మీ అమూల్యమైన ఓటు చేతు గుర్తుకు వేసి గెలిపించగలరని ఓటర్లను అభ్యర్థించారు.