బీరు పూర్ గుట్టలో నరసింహుని నమః స్వరం
జనం న్యూస్ ఫిబ్రవరి 6 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని ప్రముఖ పూణ్యకేత్రం మైన గుట్టా పై వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ జాతర బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం వేడుక అత్యంత వైభవంగా గురువారం సాయంత్రం లక్షలాది మంది భక్తజనం మద్య కన్నుల పండుగగా సాగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భక్తులు తరలిరావడంతో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ గుట్టలు గుట్టలు నరసింహుని నామస్మరంతో మారుమోగింది ఉదయం నుంచి భక్తుల తాకిడితో క్యూ లైన్లు లో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రద్దీతో చిన్న పిల్లలు వృద్దులు స్వామీ వారి దర్శనానికి అవస్తలు పడవలసి వచ్చింది . ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి పల్లకిలో గరుడవాహనంపై కుర్ఛోపెట్టుకొని బోయీలు నెత్తిన ఏంతో కోగా భజభజంత్రీల మద్య గుట్టా పై నుంచి గుట్టా కిందకి దిగారు అనంతరం రథం ముందు హోమం బలిహరణం తో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వివిధ పూలతో అలంకరించి రథం పై స్వామి వారు సతీసమేతంగా అసినులయ్యారు దీంతో రథోత్సవానికి తరలివచ్చిన భక్తజనం మంద్య రథాన్ని లాగుతూ నృసింహుని నామస్మరణతో మారుమోగగా స్వామి వారు రథం పై దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు సంతోషార్యులు మదుకుమార్ చార్యులు చిన్న సంతోష్ చార్యులు కార్యనిర్వహణాధికారి సంకుటాల శ్రీనివాస్ ఆలయ చైర్మన్ చీర్నేని శ్రీనివాస్ మాజీ కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రాంచందర్ రావు అలయ పాలక మండలి సభ్యులు సర్పంచ్ హరిష్ ఆలయ మాజీ చైర్మన్ లు ప్రతీప్ రావు రమణా రావు గోడుగు కేశవులు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పోలిస్ వారి అధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలిస్ లు బారి బందోబస్తు నిర్వహించారు




