జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగరాజు నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అటెండన్స్ రిజిస్టర్, రికార్డు లు,ఫార్మశీ రూమ్, ల్యాబ్, కాన్పుల రూమ్ పరిశీలించి తగు సూచనలు ఇచ్చిరి. మరియు నాగిరెడ్డిపల్లె 1 సచివాయ పరిధిలోని పోలీస్ స్టేషన్ వెనకవైపు కట్టపైన ఏరియాలో ఫ్రైడే- డ్రై డే సందర్బంగా కీటకజణిత వ్యాధులు మలేరియా, డెంగ్యూ, స్కృబ్ టైపాస్ గురింవి విశదీకరించి వాటి నివారణగురించితెలిపిరి.ఆరోగ్య సిబ్బంది కి తగు సూచనలు చేసిరి.ఈ సందర్బంలో డాక్టర్ శరత్ కమల్, సి హెచ్ ఓ లు వెంకట నారాయణ, మలేరియా సబ్యూనిట్ అధికారి సుబ్బారాయుడు, సీనియర్ ఎంతమలోజిస్ట్ ఖాజా మొహిద్దీన్, హెల్త్ సూపర్వైసర్ రాఘవ , సునీల్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ మధు ఆరోగ్య సబ్బంది పాల్గొనిరి.



