Listen to this article

జనం న్యూస్‌ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కి అంతర్జాతీయ పురస్కారం అందడం విజయనగరం జిల్లాకి గర్వకారణమని లోక్‌ సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో కొండపల్లిని కలిసి సత్కరించారు. మంత్రి కొండపల్లి చేసిన సేవలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని ఆయన కొనియాడారు. శ్రీనివాస్‌ యువతకి అండగా ఉండి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు.