జనం న్యూస్ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4లేబర్ కోడ్లను అమలు జరిపి కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు కట్టిబానిసలుగా చేస్తున్న మోడీ నియంతృత్వ విధానాలకు నిరసనగ ఫిబ్రవరి 12 వ తేదీన జరగబోయే దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె జరగబోతుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు పిలుపుచ్చారు.గురువారం ఉదయం సిపిఐ జిల్లా కార్యాలయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా సమ్మె గోడ పత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు మీడియాలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్ళలో అనేక కార్మిక చట్టాలను నీరుగార్చిందని, సులభతర వాణిజ్యం నెపంతో కార్మికులకు వ్యతిరేకంగా ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మికులు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సైతం మార్పులకు చర్యలు ఆచరిస్తున్నరాని విమర్శించారు. కనీస వేతనం 26వేల రూపాయలు తక్షణమే అమలు చేయాలని పని ప్రదేశాల్లో కార్మికులకు రక్షణ కల్పించాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మికుల సమ్మె హక్కును హరిస్తు 10 గంటలు పనికి పెంచారని అగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ, అంగీన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మిక స్కీం కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాలు తీసుకొచ్చి భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12 వ తేదీన జరగబోయే దేశావ్యాపిత సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు, ప్రజా సంఘాలు అందరూ స్వచ్చందంగా భాగస్వామ్యమై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. స్రవంతి, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. నాగభూషణం మాట్లాడి సదస్సుని ముగించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠెశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డేగల అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఖండేపల్లి భీముడు, జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు తదితరులు పాల్గున్నారు.


