Listen to this article

ప్రధాన ఉపాధ్యాయురాలు అయేషా,

జనం న్యూస్,ఫిబ్రవరి 07,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని చాప్ట కే,గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థిని విద్యార్థులకు,సిపిఆర్ నేర్పించిన ప్రధాన ఉపాధ్యాయురాలు అయేషా,ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో విషపూరిత ఆహారాన్ని సేవించడం వల్ల చాలా మందికి హాట్ రావడం జరుగుతుందని అన్నారు. అనుకోకుండా ఎవరైనా అకస్మాత్తుగా పడిపోయినట్లు అయితే అటువంటి వారికి వెంటనే సిపిఆర్ చేయడం వల్ల ప్రాణం కోల్పోకుండా కాపాడుకోవచ్చని విద్యార్థిని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఇలా చేయడం వల్ల ప్రాణం కోల్పోయే వ్యక్తిని ఆస్పత్రికి తరలించే వరకు కాపాడవచ్చు అని అన్నారు.కుటుంబ పెద్ద మరణించినట్లయితే ఆ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంటుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చక్కటి విద్యను బోధించడంతోపాటు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని, మానసిక దృఢత్వం పెంచే కొరకు పాట పాటలను నేర్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యను అభ్యసింపజేయాలని అన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల కంటే,నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.