బిచ్కుంద ఫిబ్రవరి 7 జనం న్యూస్
సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశానుసారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు బిచ్కుంద పట్టణంలో ఓటరు చైతన్య ర్యాలీని నిర్వహించారు . బిచ్కుంద బస్టాండ్ నుండి మొదలైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా, మున్సిపల్ ఆఫీసు నుండి ఓటు గొప్పతనం తెలుపుతూ, నినాదాల తో ప్రజల ను చైతన్యపరిచారు. మున్సిపల్ కమిషనర్ షేక్ హయ్యూం విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో ఈ చైతన్య ర్యాలీ ప్రజలు ఓటు హక్కూ వినియోగించు కునేల ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ భరత్ ,స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రాజు మరియు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కే .అశోక్ ,వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. వెంకటేశo, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.టి.హన్మండ్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వై సంజీవరెడ్డి, ఎ. రఘునాథ్ మరియు కళాశాల అధ్యాపకులు , ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు



