Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 7 సెల్ 9550978955

పల్నాడు జిల్లా కలెక్టర్‌కు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ ఎడ్లపాడు మండల కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి

చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా చూపిస్తున్న చొరవ అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ పేర్కొన్నారు. కొండవీడు ఫెస్టివల్ ఏర్పాట్ల పరిశీలనలో ఉన్న జిల్లా కలెక్టర్‌ ను కలిసి రాధాకృష్ణ కాంగ్రెస్ నాయకులు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో ప్రసిద్ధ శివ క్షేత్రమైన కోటప్పకొండను “కోటి వేల్పుల అండ– కోటప్పకొండ” అనే నినాదంతో అభివృద్ధి చేసిన తీరును వివరించి, అదే స్ఫూర్తితో కొండవీడు అభివృద్ధికి “చతుః షష్టి కళల రేడు మన కొండవీడు” అనే నినాదాన్ని అధికారికంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.కొండవీడు కోట అభివృద్ధి చెందితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మారక ద్రవ్యం లభించడమే కాకుండా, స్థానిక యువతకు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి పెట్టుబడి తో 20 సంవత్సరాల కాలంలో రెండు లక్షల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చి పెట్టగల ఏకైక రంగం పర్యాటక రంగం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని కొండవీడు ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. స్ఫూర్తివంతమైన తమ నేతృత్వంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులందరి సహకారం తీసుకొని కొండవీడు అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞాపన పత్రం ద్వారా కోరారు.. 2002-03 కాలంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు ‘కొండవీడు జిల్లా’ అని పేరు పెట్టాలని తాను తొలిసారి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి వినతి పత్రం అందించగా, జిల్లా కు పేరు పెట్టడం కన్నా ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం మంచిదని అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నందున రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కొండవీడు అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణతోపాటు జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ కల్యాణం రాఘవయ్య ఎడ్లపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాగి నరసింహారావు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు సాగి మల్లికార్జునరావు షేక్ బాజీ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కారుచోల స్వప్న కుమార్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శులు ఎండి అక్బర్ షేక్ మస్తాన్ వలి జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేశ్వరరావు నియోజకవర్గ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పేరేచర్ల రాఘవ రాజు చిలకలూరిపేట మండల యువజన కాంగ్రెస్ నాయకుడు షేక్ ఇస్మాయిల్ బీసీ నాయకులు ఉప్పాల వెంకటస్వామి తాళ్లూరి రామారావు తదితరులు ఉన్నారు.