జనం న్యూస్ 7 ఫిబ్రవరి 2026, వికారాబాద్ జిల్లా
పరిగి పట్టణమూలోని 5వ వార్డ్ బీఆరెస్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు గుప్తా,ఇంటి ఇంటి ప్రచారం లో భాగంగా నన్ను మీ బిడ్డా గా ఆశీర్వదించి, బీఆరెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ని కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని, కోరారు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీకు ఎ అవసరం ఉన్నా నేను వెంటే ఉండి అభివృద్ధి చేస్తాను, అని అన్నారు. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ఒక్క బీఆరెస్ తోనే సాధ్యమని అన్నారు, కాంగ్రెస్ వచ్చి రెండేళ్లు అయినా మన కాలనీలు అభివృద్ధి చెందాలేదాన్నారు. ఇ ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తూ బీఆరెస్ పార్టీ కారు గుర్తు కు ఓటేసి గెలిపించండి, అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తానని కౌన్సిలర్ అభ్యర్థి ఆకారపు గౌతమి రాజు, అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా అధికంగా మహిళలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



