

జనం న్యూస్ 11 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం కురిమెల్లా శంకర్ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం (ముక్కోటి) సందర్బంగా శుక్రవారం తెల్లవారు జామున భద్రాచలంలో జరిగిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొన్నారు. ఉత్తరద్వార దర్శనంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, మాజీ ఎం.ఎల్.సి బాలసాని లక్ష్మినారాయణ, మహబూబాబాద్ ఎం.పి. బలరాం నాయక్ లతో పాటు కొత్వాల పాల్గొన్నారు. భద్రాచలం రామాలయంలో పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, భక్తులు పాల్గొన్నారు.