జనం న్యూస్ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
అంగన్వాడీల సేవలు మెరుగైనవని వారి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. ఆదివారం విజయనగరంలో జరిగిన అంగన్వాడీ 9వ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు. ఐసిడిఎస్ ఏర్పడిన 50 ఏళ్ల చరిత్రలో అంగన్వాడీలు శిశు, మాతా మరణాలను తగ్గించడం కోసం గర్భిణీలకు ఎన్నో రకాల సేవలు అందించారన్నారు. ఎంత సేవ చేసిన ప్రభుత్వం ఐసిడిఎస్‌ను ప్రైవేట్ పరంచేయాలని చూస్తుందని మండిపడ్డారు. బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించారన్నారు.


