Listen to this article

జనం న్యూస్: ఫిబ్రవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా).

వైస్సార్సీపీ కార్యకర్తల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న యర్రగొండపాలెం శాసనసభ్యులు ,వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆదేశాలు మేరకు గ్రామస్థాయిలో వైస్సార్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయుటకు గ్రామ కమిటీల నియామక కార్యక్రమంలో భాగంగా ఆదివారం యర్రగొండపాలెం మండలం పరిధిలోని నర్సయపాలెం పంచాయతీ గ్రామంలో వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి,గ్రామస్థాయిలో పార్టీని మరింత బలంగా నిలబెట్టే విధంగా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.పార్టీ బలోపేతంలో ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని,గ్రామస్థాయి నుంచి ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.అదే విధంగా నర్సయపాలెం పంచాయతీ కి సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు నిర్మాణాన్ని వివరించారు.పార్టీ ని మరింత పటిష్టం చేస్తూ,భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.