హైవే మొబైల్ సిబ్బందికి అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు దిశానిర్దేశం.
జనం న్యూస్ ఫిబ్రవరి 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో 9 హైవే మొబైల్ బృందాల సిబ్బందితో (సుమారు 40 మంది) ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.గత నెల (జనవరి 2026) గణాంకాలను విశ్లేషించగా, జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉందని అదనపు ఎస్పీ పేర్కొన్నారు:జనవరిలో మొత్తం 62 ప్రమాదాలు జరగ్గా, 34 మంది ప్రాణాలు కోల్పోయారు.మరణాల సంఖ్య ఎక్కువ కావడంతో ఎస్పీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది.
చనిపోయిన వారిలో 10 మంది కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే మృతి చెందడం బాధాకరమని వారు తెలిపారు.2025 డేటా ప్రకారం.. 18 నుండి 60 ఏళ్ల లోపు పురుషులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు.
నేషనల్ హైవేలపై ప్రత్యేక నిఘా:జిల్లా గుండా వెళ్లే 94 కిలోమీటర్ల నేషనల్ హైవే-16 పై అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఈ మేరకు హైవే మొబైల్ సిబ్బందికి ఈ క్రింది ఆదేశాలు జారీ చేశారు:డేంజర్ టైమింగ్స్: గణాంకాల ప్రకారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు, మరియు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు రోడ్లపై విజిబుల్ గా ఉండి, హెచ్చరికల ప్లేకార్డులను ప్రదర్శించి, తనిఖీలు చేపట్టాలి.స్టాప్, వాష్ & గో:* రాత్రి సమయాల్లో భారీ వాహన డ్రైవర్ల నిద్రమత్తు వదిలించేందుకు ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని అమలు చేయాలి.బ్లాక్ స్పాట్స్: ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద మర్రిపాలెం, వేంపాడు చెక్ పోస్టుల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలి.అక్రమ మీడియన్ కటింగ్స్: హైవేలపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మీడియన్ కటింగ్స్ ద్వారా గ్రామస్తులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
కఠినంగా ట్రాఫిక్ నిబంధనల అమలు:హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ మరియు రాంగ్ పార్కింగ్ చేసే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. అలాగే, హైవే పక్కన ఉన్న దాబాలు, హోటళ్ల వద్ద వాహనాలను కేటాయించిన బే ఏరియా లోనే పార్కింగ్ చేసేలా యజమానులను అప్రమత్తం చేయాలన్నారు.ఈ సందర్భంగా హైవే మొబైల్స్ లో రేడియం జాకెట్స్, బెటన్ స్టిక్స్, హెచ్చరిక బోర్డులు మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీ చేశారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, నిబంధనల ఉల్లంఘనపై ఏమాత్రం ఉపేక్షించబోమని అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు హెచ్చరించారు.ఈ సమావేశంలో డీఎస్పీ బి.మోహనరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, వెంకటనారాయణ, రమేష్, ఎస్సైలు ఆదినారాయణ, విక్టోరియా రాణి మరియు హైవే మొబైల్స్ సిబ్బంది పాల్గొన్నారు.//


