Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 9 జనం న్యూస్

సోమవారం రోజు గౌరవ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను కలుపుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.
ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా శాంతియుతంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగే బిచ్కుంద మున్సిపాలిటీలోని ఓటర్లకు భద్రతా భావన, ధైర్యం మరియు విశ్వాసం కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.ఫ్లాగ్ మార్చ్‌ను మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో నిర్వహించి, ఎన్నికల సమయంలో పోలీసు శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇద్దరు సిఐలు పదిమంది ఎస్సైలు.150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ విటల్ రెడ్డి,బిచ్కుంద సీఐ రవికుమార్ ,బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, బిచ్కుంద ఎస్‌హెచ్ఓ – ఎస్‌ఐ రాజు ,సబ్ డివిజన్‌కు చెందిన ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.