జనం న్యూస్, 9 ఫిబ్రవరి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.
( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో, సర్పంచ్ చింతల గట్టు శివరాజ్ ఆధ్వర్యంలో, వృద్ధ మహిళలకు, వితంతువులకు, ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డప్పురి సంగమేశ్, వివో ఏ. మరియమ్మ, వార్డు సభ్యులు ప్రకాష్,మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


