Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఉప్పలగుప్తం మండలంలోని విలసవిళ్లి రామ మందిరంలో గ్రామ శ్రేయస్సు కొరకు గత నెల రోజులుగా వేదమంత్రాలతో, యాగాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న రిత్విక బృందానికి సర్పంచ్ సలాది ఊర్మిళాదేవి, వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు సలాది సతీష్ దంపతులు సోమవారం ఘనంగా సత్కారం నిర్వహించారు. యాగ కర్త మున్నంగి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న నక్షత్ర నవగ్రహపూర్వక మహాసౌరయాగం లో సర్పంచ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో గ్రామంలో ఆధ్యాత్మిక కృషికి పాటుపడుతున్న రిత్విక బృందానికి బహుమతులు అందజేసి, సత్కరించారు. సర్పంచ్ ఊర్మిళ దేవి సతీష్ దంపతులకు అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందించారు.