రోడ్డును బాగు చేసిన అధికారులు.
జనం న్యూస్, 9 ఫిబ్రవరి, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, మండల కేంద్రమైన ఝరాసంగంలో,అనేక చోట్ల రోడ్డు శిథిలమై, వంతెన కూలిపోయిన స్థితిని, జనం న్యూస్,5 ఫిబ్రవరిన, వార్తను ప్రచురించడం జరిగింది. ఇట్టి వార్తకు స్పందించిన అధికారులు, రోడ్డుపై ఏర్పడిన గుంతలను సరిచేసి, రోడ్డును బాగు చేయడంతో, వాహనదారులు,స్థానికులు, సంతోషం వ్యక్తం చేసి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


