జనం న్యూస్, ఫిబ్రవరి 10,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారి పండగను గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ వారు గ్రామం అంతటా విద్యుత్ దీపాలంకరణ,ఈరోజు రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోటూరు సంజీవ్, ఎంపీటీసీ సభ్యులు, శనివాడ జువ్వాల నాయుడు, ఉప సర్పంచ్ చిన్ని గోవిందు, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మోటూరు శ్రీవేణి, తెలుగుదేశం పార్టీ నాయకులు శనివాడ ఆనందరావు,బలిరెడ్డి శ్రీనివాసరావు,మలపరెడ్డి శ్రీనివాసరావు,నడుపూరు హారతి తదితరులు పాల్గొన్నారు.


