Listen to this article

జనంన్యూస్ 10.శ్రీనివాస్ పటేల్.సిరికొండ.

మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక మాత ఎల్లమ్మ 24వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ శ్రీ రేణుక మాత ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలను సమర్పించారు,అమ్మవారికి లగ్గం నాగేల్లి, కార్యక్రమాలు నిర్వహించారు.అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు,అనంతరం అన్న సత్రంలో భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు రాజా గౌడ్, క్యాషియర్ రామా గౌడ్, సభ్యులు రాజా గణేష్ గౌడ్, రామస్వామి గౌడ్, సిహెచ్ పెద్ద రాజేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, చిన్న రాజేందర్ గౌడ్, పెంటయ్య గౌడ్ తాల్లా రాజా గౌడ్, శివ గౌడ్, హన్మ గౌడ్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.