బిచ్కుంద ఫిబ్రవరి 10 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జక్కుల నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ఎన్.ఎస్..ఎస్ యూనిట్-1&2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం మంగళ వారం తో ముగిసింది. ఆఖరిరోజు మహ్మదాబాద్ గ్రామంలో యూనిటీ- 1 ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కే అశోక్ అధ్యక్షతన గ్రామ సర్పంచ్ శకుంతలా బాలు, మాజీ సర్పంచ్ రాజా గౌడ్ , మాజీ ఎంపీటీసీ నాందేవ్ ముఖ్య అతిథులుగా వచ్చేశారు. విద్యార్థులు తమ అనుభవాలన్నీ పంచుకున్నారు. పత్లాపూర్ గ్రామంలో యూనిట్ 2 ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ కే అశోక్ అధ్యక్షతన గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ పద్మినీ మారుతి, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, గ్రామ యువకులు ముఖ్య అతిథులుగా హాజరైనారు. విద్యార్థులు ఈ ఏడు రోజుల కార్యక్రమం అనుభవాలన్నీ పంచుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె అశోక్ విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలో సేవ చేసే అవకాశం ఎన్ఎస్ఎస్ ద్వారా వస్తుందని తరగతి గదిలో విద్య మాత్రమే లభిస్తుందని ఎన్ఎస్ఎస్ ద్వారా సమాజం సామాజిక సేవ నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందుతాయని వివరించారు. మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ శకుంతల బాలు మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక సేవ నివేదిక తమ గ్రామ అభివృద్ధికి ఉపకరిస్తుందని వివరించారు. ఫత్లాపూర్ గ్రామ ఉపసర్పంచ్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ తమ గ్రామాన్ని ఎంచుకున్నందుకు, విద్యార్థుల అవగాహన కార్యక్రమం చైతన్యం నింపిందని వారి నివేదిక గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. గ్రామస్తులంతా విద్యార్థులను వారి సేవలను కొని యాడుతూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి వెంకటేశం ,యూనిట్ I ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వై సంజీవరెడ్డి, యూనిట్ 2 ప్రోగ్రాం ఆఫీసర్ రఘునాథ్ మరియు కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.



