Listen to this article

జనం న్యూస్‌ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఇద్దరు కవలలు మెగా వారసులు కు జన్మనిచ్చిన శుభసందర్భంగా ఈరోజు తేది అనగా 10-02-2026 మంగళవారం నాడు పలు సేవా కార్యక్రమాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో ముందుగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి కోవెలలో రామ్ చరణ్ ఉపాసన దంపతుల గోత్రనామాలతో “ప్రత్యేక పూజలు” నిర్వహించారు. అనంతరం విజయనగరం లోనున్న థియేటర్స్ యాజమాన్యం టీమ్స్ కు స్వీట్ బాక్స్ లు పంపిణి చేశారు. కి. ఎల్ పురం యాతపేట గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్స్ పంపిణీ చేశారు.హిమగిరి థియేటర్ లో మెగా అభిమానుల ఆధ్వర్యంలో మెగా ప్రిన్సెస్ “కేక్ కటింగ్” సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోం ఫైర్ ఆఫీస్ దగ్గర పట్టణ నిరాశ్రయులకు మధ్యాహ్న భోజన పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా చిరంజీవి యువత రామ్ చరణ్ యువ శక్తి టీం ప్రతినిధులు ముఖ్య కార్యవర్గ సభ్యులు పలువురు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.