Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే క్యూలైన్లలో వేచి ఉన్నారు. అధికారులు అన్ని కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించారు. ఎన్నికల్లో ఓటింగ్l లో వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, తన ఓటు హక్కును వదులుకోవద్దనే పట్టుదలతో తరలివచ్చారు. తన కుమారుడి సహాయంతో పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో తాను కూడా భాగస్వామి కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. ఎన్నికల ప్రక్రియ సాగుతున్న తీరును ఆమె క్షేత్రస్థాయిలో పర్య వేక్షించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసేలా చూడాలని ఆదేశించారు. భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఎన్నికల్లో మొత్తం 78.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 12,759 ఓటర్లకు 10,014 మంది ఓట్లు వేసినట్లు అధికారులు చెప్పారు. పురుషులు 4,921 ລ້, ລໍ 5,092, ໙ 1 ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 79.36 శాతం, మహిళలు 77.67 శాతం మంది ఓటు వేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.