బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు యూరియా ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయం పై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యూరియా విషయంలో గత పంట కాలంలో జరిగిన సమస్యలను పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కొత్తగా యూరియా బుకింగ్ మొబైల్ యాప్ ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా రైతులు తమ మొబైల్ ఫోన్లలో ఇంటి నుండే వారికి నచ్చిన దుకాణాలలో యూరియా బుకింగ్ చేసుకుని ఆ దుకాణానికి వెళ్లి ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా యూరియా తీసుకొని వచ్చే అవకాశం కల్పించడం జరిగింది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు రైతు ఇంటి వద్ద నుండే ఈ యాప్ ద్వారా తనకు దగ్గరలో ఉన్న దుకాణాలలో ఎంత మేరకు యూరియా నిలువలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.రైతులు యూరియా కొరత ఉన్నదని అపోహలో భయాందోళనలో దుకాణాలకు వెళ్లి యూరియా కొనాల్సిన అవసరం లేదు పంట పండించిన నిజమైన రైతులు మాత్రమే తమకు నచ్చిన దుకాణానికి వెళ్లి యూరియా కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది.యూరియా పంపిణీ రైతులు వేసిన పంటలను బట్టి సముచితంగా పారదర్శకంగా చేయబడుతుంది.ఈ వివరాలన్నింటినీ రైతులకు తెలియజేయడం మరియు రైతులు వెల్లబుచ్చిన సందేహాలను కూలంకషంగా వారికి నివృత్తి చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, గ్రామ సర్పంచ్ ఇక్బాల్ ఉన్నిస్స బేగం, ఉప సర్పంచ్ మాధవరావు, వ్యవసాయ విస్తరణ అధికారి భాను ప్రశాంత్, గ్రామ పాలన అధికారి సాయిలు మరియు రైతులు పాల్గొన్నారు.



