జనం న్యూస్, ఫిబ్రవరి 12, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
వివేకానంద నగర్ డివిజన్ ప్రజల ఆశీస్సులతో కార్పొరేటర్‌గా ఎన్నికై ఐదేళ్లపాటు సేవలందించే అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు మాధవరం రోజా దేవి రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు కూడా ఆమెతో పాటు పాల్గొన్నారు.రోజా దేవి రంగారావు మాట్లాడుతూ, వివేకానంద నగర్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి కార్పొరేటర్‌గా గెలిపించి ప్రజలకు సేవ చేసే అరుదైన అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల కాలంలో డివిజన్ అభివృద్ధి దిశగా చేపట్టిన పలు కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజల నుంచి విశేష సహకారం లభించిందని గుర్తుచేశారు.డివిజన్లో మౌలిక వసతుల అభివృద్ధి, కాలనీల్లో రహదారుల మెరుగుదల, పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో సాధించిన పురోగతికి ప్రతి ఒక్కరి సహకారమే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి అభివృద్ధికి దోహదపడినట్లు అభినందించారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజా సేవలో ముందుండి పని చేస్తానని, డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని రోజా దేవి రంగారావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


