జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన మండలం నడవపల్లి పల్లిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ వార్షికోత్సవం గ్రామస్తు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చిన్నబ్బాయి బ్రహ్మత్వంలో కర్రీ వీరబాబు ధనలక్ష్మి విశ్వనాథపల్లి రామరాజు అమరావతి దంపతులచే స్వామివారికి అభిషేకము మంటపారాధన కలశ పూజ నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పాల్గొని ప్రతి పౌర్ణమి రోజున స్వామివారికి సామూహిక హారతి ప్రతి ఏకాదశ రోజున గ్రామంలో నగర సంకీర్తన నెలకొకసారి సత్సంగం నిర్వహించడం వలన గ్రామం సుభిక్షంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మట్ట సూరిబాబు పెనుపోతు శ్రీరాములు విశ్వనాథపల్లి ప్రకాష్ రావు బొమ్మిడి మల్లేశ్వర రావు మల్లాడి శ్రీను దోమ భోగిరాజు పువ్వుల ఏడుకొండలు పినపోతు రాంబాబు బొంతు రామారావు తదితరులు పాల్గొన్నారు.


