జనం న్యూస్ ఫిబ్రవరి 12: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలములోని తాళ్ళరాంపూర్ వ్యవసాయ సహకార సంఘం ఫంక్షన్ హాల్ లో రైతులకు యూరియా బుకింగ్ యాప్ వినియోగం ఉపయోగాలు పై మండల వ్యవసాయ అధికారి శేరి వైష్ణవ్అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుంచి రైతులు అందరూ వారికి కావలసిన మోతాదు లో యూరియా ను ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే బుక్ చేసుకొని సమీప డీలర్ వద్ద యూరియా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఈ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది అని తెలిపారు. రైతులు అందరూ ఈ యాప్ ను ఫోన్ లలో డౌన్లోడ్ చేసుకుని యూరియా బుక్ చేసుకోవాలి అని సూచించారు. ఏదైనా సమస్య లు ఉంటే తమను సంప్రదించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మనీషా, సాయి సచిన్, దోంచందా గ్రామ సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, తాళ్ళరాంపూర్ గ్రామ ఉప సర్పంచ్ చాట్ల జనార్ధన్, CEO గణేష్, సొసైటీ సిబ్బంది, సంఘ పరిధిలో గల రైతులు పాల్గొన్నారు.


