Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాజంపేట పార్లమెంటరీ బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి గుంటకల్ డివిజన్ రాజంపేట సెక్షన్ ఎడిఈఎన్ బి వాసుదేవ నాయుడుని కలిసి నందలూరు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణము లో భాగముగా నీరు లీకేజీ కావడం జరుగుతున్నదని దాని వలన రైల్వే అండర్ బ్రిడ్జి లో పోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళనకుగురవుతున్నారని తెలపడం జరిగినది అలాగే రైల్వే అండర్ బ్రిడ్జినిర్మాణానికి లైటింగ్ సదుపాయంఇవ్వ వలెనని అలాగే రైల్వే అండర్ బ్రిడ్జి పైకప్పు భాగాన్ని షెల్టర్ రూపంలో నిర్మించాలని కోరడమైనది మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క భద్రతలను కాపాడాలని కోరడం జరిగినది హిందువులు యొక్క స్మశాన వాటికకు పోయే దారిలో ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారని ఆ యొక్క గోడ నిర్మాణం లేకుండా గేటు నిర్మించాలని అలాగే రైల్వే పంప్ హౌస్ వరకు రోడ్డు నిర్మించాలని కోరడమైనది ఇందుకుగాను ఏడిఈఎన్ వాసుదేవ నాయుడు మాట్లాడుతూ ప్రొటెక్షన్ వాల్ యొక్క స్థలములో గేటు నిర్మాణం చేపిస్తానని చెప్పడం జరిగినది .అలాగే త్వరలో ఇన్స్పెక్షన్ ఆర్ యు బి ని చేసి ట్రైన్ రన్ విషయాలలో జరిగే రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను అత్యున్నత అధికారులకు ప్రజల యొక్క సమస్యలను తెలియజేసి ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. రాచూరి మురళి ఏ డి ఇ ఎన్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగినది