సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13. 02. 2026
జహీరాబాద్ నియోజకవర్గంలోని 37వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో పెద్దబ్బాయి మైపాల్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రజల నమ్మకం, అభిమానం, మద్దతుతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టిన మైపాల్ విజయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉండుతూ, సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేసిన నాయకుడిగా పెద్దబ్బాయి మైపాల్ గుర్తింపు పొందారు.ఎన్నికల ప్రచారంలో డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న మైపాల్, వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తన ప్రణాళికలను ప్రజలకు వివరించారు. అదే విధంగా యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సంక్షేమం, వృద్ధుల సమస్యల పరిష్కారంపై కృషి చేస్తానని చెప్పారు.భారీ మెజార్టీతో విజయం సాధించిన అనంతరం పెద్దబ్బాయి మైపాల్ మాట్లాడుతూ, ఈ గెలుపు తన వ్యక్తిగత విజయం కాదని, 37వ వార్డు ప్రజల గెలుపు అని అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పని చేస్తానని హామీ ఇచ్చారు.మైపాల్ విజయం సందర్భంగా వార్డులో సంబరాలు అంబరాన్ని అంటాయి. కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించారు. పెద్దబ్బాయి మైపాల్ విజయం జహీరాబాద్ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


