Listen to this article

జనం న్యూస్ 13 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

భారత రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి ప్రయత్నాలను అడ్డుకుందామని డిసిసి అధ్యక్షులు రాజీవ్ రెడ్డి,సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ కార్మిక వర్గానికి, ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కార్మిక,రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాల సవరణ ద్వారా భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్రుత్వం వంటి అంశాలను ధ్వంసం చేసేందుకు బిజెపి చేస్తున్న కుటిల యత్నాలను కార్మిక వర్గం ఐక్యంగా ఉండి అడ్డుకోవాలన్నారు. కార్మికులకు సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ లేకుండా, కనీస వేతనాలు పొందే ఆర్థిక సమానత్వం లేకుండా, ప్రజల మధ్య సౌబ్రాతృత వాతావరణం లేకుండా బిజెపి చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలని కోరారు.కార్మిక వర్గ హక్కులను కాలరాస్తూ దేశాన్ని దేశ సంపదను విదేశీ పెట్టుబడిదారులకు అప్పచెబుతున్నారని విమర్శించారు. సులభతర వాణిజ్యం పేరుతో భారతదేశ శ్రమజీవులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చే బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలన్నారు. నాడు సామ్రాజ్యవాదులతో పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం అన్యాయం అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలతో కనీసం చర్చలు చేయకుండా సమిష్టి భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా కార్మిక చట్టాలను రద్దుచేసి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని భంగం కలిగించే చర్యలు తీసుకుందన్నారు. ఒకవైపు కార్మిక చట్టాలను రద్దుచేసి, మరోవైపు దేశ రైతాంగాన్ని కార్పొరేటీకరణ శక్తులకు అప్పజెప్పేందుకు జాతీయ విత్తన సవరణ,విద్యుత్ సవరణ బిల్లులను తీసుకొచ్చారని విమర్శించారు.దేశభక్తి, ధర్మం ముసుగులో కార్మికుల సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను,విదేశీ కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని విమర్శించారు.గ్రామీణ ప్రజల ఉపాధికి గండి కొట్టే విధంగా తీసుకొచ్చిన విబిజిరాంజీ బిల్లును తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను యధాతథంగా కొనసాగించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని,ఉపాధి కూలీలకు కనీస కూలి 600 ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని,జాతీయ విత్తన,విద్యుత్ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కార్మిక వర్గం ఐక్య ప్రతిఘటన పోరాటాల ద్వారా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ,టియుసిఐ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శులు చింతరేవుల కృష్ణ,జమ్మి చేడు కార్తీక్, బ్యాంకు ఉద్యోగులు సంఘం నాయకులు రవికుమార్,సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు జి.గోపాల్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం ఆశన్న, హరీష్, జిల్లా కన్వీనర్ ఉప్పేర్ అంజి,ఆశ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ, సునీత,వివోఎల సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మప్ప,వసతి గృహ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయాకర్,అంగన్వాడీలు,హమాలీలు గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు,మధ్యాహ్నం భోజనం వర్కర్లు, వి ఓ ఎ వసతి గృహ, మున్సిపల్ తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు ధన్యవాదాలతో కార్మిక, రైతు సంఘాలు జోగులాంబ గద్వాల జిల్లా