Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

దేవాదాయ ధర్మాదాయ శాఖ వేల్పుపుల వీధి స్వయంభు దేవాలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు, ఆమెను పాలకవర్గ సభ్యులు, ఈవో ఘనంగా సత్కరించారు, ఆలయంలో స్తంభానికి నూతనంగా తయారుచేసిన ఇత్తడి తొడుగులు పూజలు చేసి ప్రారంభించారు. ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేస్తున్నారో ఆలయ ఈవో బి మురళీకృష్ణ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తాటికొండ కామేశ్వరరావు(రాంబాబు), ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.//