Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 13

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో చిలకలూరిపేట పోలింగ్ కేంద్రం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సుగాలి కాలనీ నందు తన ఓటు హక్కును వినియోగించుకున్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, న్యాయవ్యవస్థ బలోపేతం మరియు పారదర్శక పరిపాలనకు బార్ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా నిర్వహించబడుతున్నందుకు నిర్వాహకులను అభినందించారు.ఒకవైపు శాసనమండలి సమావేశాలలో బిజీగా ఉంటూ ఆ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలు లేవనెత్తుతూ, మరోవైపు జరుగుతున్న బార్ కౌన్సిల్ ఎన్నికలలో పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యం పట్ల మర్రి రాజశేఖర్ కి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.