Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన

జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం మండల పరిధిలోని కుండలేశ్వరంలో పర్యటించారు. వృద్ధ గౌతమి నది తీరాన ఉన్న స్నాన ఘట్టాన్ని పరిశీలించారు. గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని, భక్తులు నదిలో లోతుకు వెళ్లకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.పార్వతీ కుండలేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు పరిశీలించారు . మహాశివరాత్రి రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని దర్శన విభాగాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలకు అవకాశం కల్పించాలి చెప్పారు. భక్తుల ఇబ్బంది కలగకుండా ఆలయ వద్ద స్వచ్ఛంద సంస్థల ద్వారా క్యూలైన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆదేశించారు అనంతరం శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్, ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, ఎస్సై అవినాష్, గోకర కొండ సత్యనారాయణ మూర్తి తవటపల్లి నాగేంద్ర ( నాగు ), పి ఎస్ ఎన్ రాజు, మోటేపల్లి శ్రీనివాస్, శివ, తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.