జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి
స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆసుపత్రి సూపర్డెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రవికుమార్ ను కలిసి ఆయనకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు . ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ అనకాపల్లి పట్టణ మరియు జిల్లా పరిధిలోని పలు గ్రామీణ ప్రాంతాల నిరుపేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలకు ప్రధాన ఆధారమైన మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించే చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు వైద్య సేవలలో బయట వ్యక్తుల ప్రమేయాన్ని దోపిడీని అరికట్టే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కృషి చేస్తున్నామని ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు.//


